ప్రధాన ఎన్నికల కమిషనర్ తనకిదే చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ అని CEC రాజీవ్ కుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా ఒక ఎలక్షన్ సైకిల్ పూర్తిచేసుకున్నానని తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై వచ్చిన ఆరోపణలు కొట్టిపారేశారు. ఆఖరి గంటలో పోలింగ్ పెరగడం, ఓటింగ్ యంత్రాలపై కొన్ని పార్టీల నిందలపై షయరీలతో సెటైర్లు వేశారు. దేశ ఓటర్లలో మహిళల వాటా, ప్రభావం గణనీయంగా పెరిగాయన్నారు. ప్రజాస్వామ్యంలో యువత కీలకంగా మారాలని సూచించారు.