తెలంగాణలో టీడీపీ బలోపేతం, సభ్యత్వాల పెంపుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. 4 దశాబ్దాల్లో పార్టీ ఎత్తుపల్లాలు, విజయాలను ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతంపై నేతలతో చంద్రబాబు చర్చించారు. నేతలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు.