నారాయణ కాలేజీలో విద్యార్థిని సూసైడ్.. ప్రభుత్వం సీరియస్

75చూసినవారు
HYD: బాచుపల్లి నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనూష సూసైడ్ చేసుకోవడంపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ల శారద మండిపడ్డారు. కాలేజీ స్టాఫ్ మొత్తాన్ని మార్చండి అని అన్నారు. 'ఇదే కాలేజీని కొన్ని రోజుల ముందే తనిఖీ చేశాను. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పాను. అయినా యాజమాన్యం పట్టించుకోలేదు. ప్రతి ఇన్‌స్టిట్యూట్‌ లో తనిఖీలు చేస్తాను. ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంది' అని చెప్పారు.

సంబంధిత పోస్ట్