టూరిస్టు బస్సుపై చిరుత దాడి.. షాకింగ్ వీడియో

74చూసినవారు
కర్నాటకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడి బన్నెరఘట్ట బయోలాజికల్ పార్క్ లో టూరిస్టు బస్సుపై చిరుత దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. పర్యాటకులతో కూడిన ఓ బస్సు పార్క్ లోకి ప్రవేశించగా ఒక్కసారిగా చిరుత దానిపైకి దూసుకొచ్చింది. బస్సు వెనుక కిటికీపైకి ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. పర్యాటకులు కేకలు వేయడంతో కిందకు దిగింది. బస్సు ముందుకు వెళ్లినా వెంబడించి అందులో ఉన్న వారిపై దాడికి యత్నించింది.

సంబంధిత పోస్ట్