ఐపీఎల్ 2021లో భాగంగా తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ ఆసక్తికరమైన సమరానికి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వబోతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి అర్హత సాధించనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో రెండు జట్లు ఇప్పటి వరకూ 25 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడ్డాయి. 15మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించగా.. మిగిలిన 10 మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలిచింది. కాగా ప్రస్తుత సీజన్ లీగ్ దశలో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోను చెన్నైని ఢిల్లీ చిత్తుగా ఓడించింది.