ప్రస్తుత బిజీ లైఫ్‌లో పని ఒత్తిడి, ఆందోళన వల్ల హై బీపీ చాలా మందిలో కనిపిస్తోంది. హైబీపీ ఉన్న వారు అరటి పండ్లను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిలోని పొటాషియం వల్ల రక్తపోటును అదుపులో ఉంటుంది. వీటిని మితంగా, వైద్యుల సలహాతో మాత్రమే తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. హై బీపీ నియంత్రణకు ఆకుకూరలు, బచ్చలికూర, పుచ్చకాయ, నారింజ, దుంపలు, ఓట్స్ వంటి పోషకాహారంతో కూడిన ఆహారాన్ని డైలీ ఆహారంలో చేర్చుకోవాలి.