దర్శన్ ఖైదీ నంబర్‌తో చిన్నారి ఫొటోషూట్.. కేసు నమోదు

81చూసినవారు
దర్శన్ ఖైదీ నంబర్‌తో చిన్నారి ఫొటోషూట్.. కేసు నమోదు
కన్నడ హీరో దర్శన్ తన అభిమానిని చిత్రహింసలు పెట్టి హత్య చేసిన కేసులో జైలు పాలయ్యాడు. అయితే కర్ణాటకలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం క్రేజీగా కొనసాగుతోంది. తాజాగా ఓ జంట తమ బిడ్డను ఖైదీ నంబర్ 6106 (జైలులో దర్శన్‌కు కేటాయించిన నంబర్) అని రాసి ఉన్న తెల్లటి దుస్తుల్లో ఉంచి ఫోటో షూట్ చేశారు. ఇది వైరల్ కావడంతో బాలల హక్కుల సంఘం కేసు నమోదు చేసింది. ఇదిలా ఉండగా.. పలువురు అభిమానులు 6106 అని టాటూ వేయించుకోవడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్