తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో చిన్న పిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో చిన్నారులు న్యూమోనియా బారిన పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో రోజుకు పదుల సంఖ్యలో చిన్నారులు చేరుతున్నారు. కాగా, తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరం నీలం రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.