ఓ కారుపై సింహం దాడికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ సింహం అడవిలోంచి బయటకు వచ్చింది. అక్కడ కొంతమంది కారులో ఉండగా.. ఆ సింహం ఒక్క ఉదుటున డ్రైవర్ కిటికీలోకి దూరి దాడి చేసేందుకు యత్నించింది. అయితే, వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ తన కారును వెనక్కు పోనిచ్చి అద్దాలు ఎత్తాడు. దీంతో సింహం వారిని వదిలేసింది. వారంతా ప్రాణాలతో బయటపడ్డారు.