ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులపై చర్చించారు. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్డు, పర్యాటక శాఖకు సంబంధించిన ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఈ భేటీలో సీఎంతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సురేఖ పాల్గొన్నారు.