గిట్టుబాటు ధర దక్కక మిర్చి రైతు ఆత్మహత్య

79చూసినవారు
గిట్టుబాటు ధర దక్కక మిర్చి రైతు ఆత్మహత్య
TG: సూర్యాపేట జిల్లాలో సిరికొండలో మిర్చి పంటకు సరైన గిట్టుబాటు ధర దక్కకపోవడంతో గణేష్ (36) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గణేష్ క్వింటాన్నర మిర్చి పంట అమ్మగా రూ.19 వేలే చేతికొచ్చాయి. దాంతో పంట ఇంత తక్కువకి ఎందుకు అమ్మావని భార్య గణేష్‌ను ప్రశ్నించడంతో వారి మధ్య గొడవ జరిగింది. మనస్తాపంతో గణేష్ గురువారం కలుపు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మంలోని ఆసుపత్రికి చికిత్స పొందుతూ శుక్రవారం అతడు మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్