అశ్వనీదత్‌కు శంఖాన్ని బహుమతిగా అందజేసిన చిరంజీవి

82చూసినవారు
అశ్వనీదత్‌కు శంఖాన్ని బహుమతిగా అందజేసిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మించిన ‘ఇంద్ర’ ఇటీవల రీ రిలీజ్ అయింది. ఈ క్రమంలో చిత్ర బృందాన్ని చిరంజీవి కలిశారు. నిర్మాత అశ్వనీదత్‌, దర్శకుడు బి.గోపాల్‌, సంగీత దర్శకుడు మణిశర్మ, సినీ రచయితలు పరుచూరి బ్రదర్స్, చిన్నికృష్ణలను ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు. ఇందులో భాగంగా అశ్వనీదత్‌కు ఒక అందమైన శంఖాన్ని బహుమతిగా అందజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అశ్వనీదత్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్