తెలంగాణ అథ్లెట్ జీవాంజి దీప్తిని మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు. సోమవారం హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జీవాంజి దీప్తికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుల్లెల గోపీచంద్, చాముండేశ్వరీనాథ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవాంజి దీప్తి ప్రతిభకు తగిన గుర్తింపు లభించిందని చిరంజీవి వ్యాఖ్యానించారు. పారాలింపిక్స్ చరిత్రలో పతకం సాధించిన తొలి తెలుగు క్రీడాకారిణిగా తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.