లెబనాన్-ఇజ్రాయిల్ సరిహద్దు 120 కిలోమీటర్ల పొడవునా ఘర్షణలు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా వైమానిక దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయిల్, హిజ్బుల్లా మిలటరీ మౌలిక సదుపాయాలను, లాంచ్ సైట్‌లను ధ్వంసం చేయడమే తమ లక్ష్యమని చెబుతోంది. ఉత్తర ఇజ్రాయిల్‌లోని తమ ఇళ్లకు వెళ్లాలంటే వేలాదిమంది ఇజ్రాయిలీలకు ఇదొక్కటే మార్గం కావడంతో సరిహద్దు నుండి వైదొలగాల్సిందిగా హిజ్బుల్లా కార్యకర్తలను కోరుతోంది. గాజాపై ఇజ్రాయిల్ దాడులను ఆపితేనే సరిహద్దు వద్ద పరిస్థితుల గురించి తాము చర్చిస్తామని హిజ్బుల్లా తేల్చి చెబుతోంది.