హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థలో భారీ సంఖ్యలో ఫైటర్లు ఉన్నారు. వీరి మధ్య సమాచారం, ఆదేశాలు జారీ వంటివి జరగాలంటే కమ్యూనికేషన్ వ్యవస్థ బలంగా ఉండాలి. వారు ఇజ్రాయెల్‌కు దొరక్కుండా పేజర్లు, వాకీ టాకీలు వాడుతున్నారు. కానీ, ఇజ్రాయెల్‌కు చెందిన యూనిట్ 8200 వ్యూహం దెబ్బకు వారి కమ్యూనికేషన్ వ్యవస్థ చాలావరకు ధ్వంసమైంది. పేజర్లు, వాకీటాకీలను పేల్చేస్తోంది. పవర్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పాటుచేసిన సోలార్ పరికరాలు పేలడం మొదలయ్యాయి.