రైతుల ఆత్మహత్యాయత్నంపై సీఎం ఆరా

80చూసినవారు
రైతుల ఆత్మహత్యాయత్నంపై సీఎం ఆరా
AP: అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లిలో ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జిల్లా అధికారులతో మాట్లాడిన ఆయన.. ఆ రైతులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. శనివారం కురిసిన వడగళ్ల వానతో పంట నష్టపోయిన అరటి రైతులు లక్ష్మీనారాయణ, చిన్న వెంగప్ప ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీంతో వారిని హుటాహుటిన అనంతపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్