అలర్ట్.. రేపు పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు

56చూసినవారు
అలర్ట్.. రేపు పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు
కాకినాడ జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లను రైల్వే అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, రావికంపాడు స్టేషన్ల మధ్య సిగ్నలింగ్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతుండడంతో రైళ్లను నిలిపివేశారు.ఈ క్రమంలో ఉదయ్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్ సోమవారం తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే మరో నాలుగు రైళ్లు ఈనెల 24న రెండువైపులా రద్దు చేశారని, ప్రయాణికులు గమనించాలని స్టేషన్ మేనేజర్ రమేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్