బలభద్రపురంలో 37 మందిలో క్యాన్సర్ లక్షణాలు

79చూసినవారు
బలభద్రపురంలో 37 మందిలో క్యాన్సర్ లక్షణాలు
AP: క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న తూ.గో జిల్లా బలభద్రపురంలో ఇంటింటి సర్వే, వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. 31 బృందాలతో సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 37 మందిలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నాయని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 23 మంది చికిత్స పొందుతుండగా.. వీరిలో 10 మంది దీర్ఘకాల వ్యాధిగ్రస్థులున్నారు. గత రెండు రోజులుగా 2,803 ఇళ్లను సందర్శించి, 8,830 మందిని పరీక్షించారు.

సంబంధిత పోస్ట్