ఏప్రిల్ నెలలో పెళ్లికి ఏకంగా 9 ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఒకే నెలలో ఇన్ని మంచి రోజులు రావడం చాలా అరుదని పండితులు అంటున్నారు. ఏప్రిల్ 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. పెళ్లికి మంచి ముహూర్తాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో వేలాది వివాహాలు జరిగే అవకాశం ఉందని పండితులు అంచనా వేస్తున్నారు.