ఇంటర్ ఎగ్జామ్ పేపర్ లీకైనట్లు వార్తలు రావడంతో ఇంటర్ పరీక్షలను రద్దు చేసింది ఇంటర్ బోర్డు. బీజేపీ పాలిత అస్సాం రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. మార్చి 21న ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంది. అయితే ఆ పేపర్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అస్సాం హైయర్ సెకండరీ బోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 21న జరగాల్సిన ఎగ్జామ్‌తో పాటు మార్చి 29 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను రద్దు చేసింది.