మహిళల ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో భారత ప్రభుత్వం పోస్టాఫీసు కింద మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (MSSC) పొదుపు పెట్టుబడి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రూ.1000 నుంచి రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. రెండేళ్ల తర్వాత 7.5 శాతం వడ్డీతో కలిపి మొత్తం తీసుకోవచ్చు. అత్యవసరమైనప్పుడు డిపాజిట్‌లో 40% విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈనెల మార్చి 31లోగా ఈ స్కీం ఆగిపోనుంది.