తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే మాజీ అధ్యక్షుడు ఎం కరుణానిధి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నివాళులర్పించారు. చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో కరుణానిధి చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సోదరి, డీఎంకే లోక్‌సభ సభ్యురాలు కనిమొళి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కరుణానిధి వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో 2018 ఆగస్ట్ 7న కన్నుమూశారు.