సూదిని జైపాల్ రెడ్డి చిత్రపటానికి సీఎం పుష్పాంజలి (వీడియో)

52చూసినవారు
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డికి గురువారం సీఎం రేవంత్ నివాళులు అర్పించారు. ఆయన జయంతి సందర్భంగా ఢిల్లీలోని అధికార నివాసంలో ఆ మహానేత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ పల్లె నుంచి ఢిల్లీ దాకా సాగిన జైపాల్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో నైతిక విలువలకు కట్టుబడ్డారని గుర్తుచేసుకున్నారు. మంత్రి పొంగులేటి, ఎంపీ సురేష్ షెట్కర్, తదితరులు జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్