మాజీ స్పీకర్ పోచారంతో సీఎం రేవంత్ భేటీ

57చూసినవారు
మాజీ స్పీకర్ పోచారంతో సీఎం రేవంత్ భేటీ
బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తాయి. నేడో, రేపో ఆయన హస్తం కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో ఆయన పలుమార్లు మంతనాలు జరిపారని సమాచారం. కాగా ఈరోజు పోచారం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి కూడా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్