జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం లంగర్ హౌజ్ బాపూ ఘాట్ లో నివాళులు అర్పించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. సీఎం రేవంత్ తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీపీ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, వి.హనుమంతరావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, కేకే తదితరులు నివాళులు అర్పించారు.