హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. 'ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో 10 వరకు థియేటర్లు ఉన్నాయి. అల్లు అర్జున్ రావడంతో పరిస్థితి అదుపుతప్పింది. అతికష్టం మీద హీరోను లోపలికి తీసుకెళ్లారు. హీరోను చూసేందుకు వేలసంఖ్యలో జనం వచ్చారు. తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు' అని వ్యాఖ్యానించారు.