సీఎం రేవంత్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

85చూసినవారు
సీఎం రేవంత్ కీల‌క ప్ర‌క‌ట‌న‌
పోలీసు అమరుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైలు మరణిస్తే రూ.కోటి, శాశ్వత అంగవైకల్యం కలిగితే రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామన్నారు. ఎస్సై, సీఐలు మరణిస్తే రూ.1.20 కోట్లు, డీఎస్సీ, ఏఎస్పీలకు రూ.1.50 కోట్లు నష్టపరిహారం, శాశ్వత అంగవైకల్యం కలిగితే రూ.60లక్షలు చెల్లిస్తామన్నారు. ఎస్పీ, ఐపీఎస్‌లు మరణిస్తే రూ. 2 కోట్లు, అంగవైకల్యం కలిగితే రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్