TG: సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు చేర్చేది ఉద్యోగులే అని సీఎం రేవంత్ అన్నారు. ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. 'ఈ ప్రభుత్వం మనది.. ఆదాయాన్ని పెంచాలన్నా, పెంచిన ఆదాయం పంచాలన్నా మీ చేతుల్లోనే ఉంది. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని మాకు ఉన్నా చేయలేని పరిస్థితి. మీ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం' అని పేర్కొన్నారు.