తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రవేశపెట్టిన తీర్మానానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తెలిపారు. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. 'కేంద్రంలో కూడా ఓబీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని మన్మోహన్‌ను కేసీఆర్ కోరారు. అవమానం చేస్తే ఆకాశం తగ్గదు, ఎన్ని విమర్శలు చేసినా మన్మోహన్ సింగ్ ప్రతిష్టను దిగజార్చలేరు' అని పేర్కొన్నారు.