సీఎం రేవంత్ ఈనెల 17న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరిగే CWC సమావేశానికి అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. తెలంగాణ నుండి CM రేవంత్, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓటమి గురించి చర్చించనున్నట్టు సమాచారం. త్వరలో జరగబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల దృష్ట్యా పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.