తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, కో ఛైర్మన్ శ్రీని రాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు చర్చించారు.