టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. భారత్ క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాసిందని నారా చంద్రబాబు కొనియాడారు. 17 ఏళ్ల తరువాత టీ20 వరల్డ్ కప్ కలను రోహిత్ సేన సహకారం చేసిందని మెచ్చుకున్నారు. ప్రపంచ క్రికెట్లో భారత్ కు ఎదురులేదని మరోసారి నిరూపించారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.