బాలుడి గొంతులో ఇరుక్కున్న నాణెం.. ఏడేళ్ల తర్వాత తొలగింపు

68చూసినవారు
బాలుడి గొంతులో ఇరుక్కున్న నాణెం.. ఏడేళ్ల తర్వాత తొలగింపు
ఓ బాలుడి గొంతులో ఇరుక్కున్న రూపాయి నాణాన్ని ఏడేళ్ల తర్వాత డాక్టర్లు గుర్తించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ బఘౌలీలో చోటుచేసుకుంది. అయితే టెలిస్కోప్ సర్జరీ విధానం ద్వారా కాయిన్‌ను బయటకు తీశారు. మురళీపూర్వ గ్రామానికి చెందిన అన్‌కుల్‌(12) జూన్‌ 4న గొంతులో నొప్పిగా ఉందని తన కుటుంబానికి చెప్పాడు. వెంటనే హర్దోయ్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి ఎక్స్‌ రే తీయగా గొంతులో రూపాయి నాణెం గుర్తించారు. కాగా ఐదేళ్ల వయసులో ఈ నాణేన్ని ఆ బాలుడు మింగినట్లు డాక్టర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్