విజయ్ ‘గోట్’ సినిమాను వీక్షించేందుకు మేకతో వచ్చిన హాస్యనటుడు (వీడియో)

56చూసినవారు
కోలీవుడ్ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ నటించిన ‘గోట్‌' (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌) ఇవాళ విడుదలైన విషయం తెలిసిందే. తమిళనాడు థియేటర్స్‌ వద్ద విజయ్‌ ఫ్యాన్స్‌ కోలాహలం నెలకొంది. డప్పు వాయిద్యాలు, టపాసులు, డ్యాన్సులతో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళ హాస్యనటుడు కూల్‌ సురేశ్‌ ‘గోట్‌’ చిత్రాన్ని వీక్షించేందుకు చెన్నైలోని ఓ థియేటర్‌కు మేకతో వచ్చారు. అతన్ని చూసిన అభిమానులు చుట్టుముట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్