రైళ్ల రద్దీ.. అమితాబ్‌ సహాయం కోరిన కాంగ్రెస్‌

54చూసినవారు
రైళ్ల రద్దీ.. అమితాబ్‌ సహాయం కోరిన కాంగ్రెస్‌
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌ పేరును ప్రస్తావిస్తూ.. ప్రజల ఇక్కట్లను కేంద్రం దృష్టికి కాంగ్రెస్ తీసుకెళ్లింది. 'అమితాబ్‌ బచ్చన్‌జీ.. మీనుంచి మాకో సహాయం కావాలి. కోట్లాది మంది సామాన్య ప్రజలు రైళ్లలో ఈ విధంగా ప్రయాణించాల్సి వస్తోంది' అంటూ రైలులో రద్దీకి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. సెలబ్రిటీలు ప్రజా సమస్యలను లేవనెత్తితే.. కేంద్రం వెంటనే స్పందిస్తోందని, అందుకే అమితాబ్ పేరును ప్రస్తావించినట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్