ప్రజ్వల్ రేవణ్ణ తల్లికి సిట్ నోటీసులు

57చూసినవారు
ప్రజ్వల్ రేవణ్ణ తల్లికి సిట్ నోటీసులు
లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు ఇవాళ కర్ణాటక సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఓ కేసులో విచారించేందుకు ఆమెకు ఆ నోటీసులు ఇచ్చారు. ఐపీసీ 64ఏ, 365, 109, 120బీ సెక్షన్ల కింద నమోదు అయిన కేసులో భవానీ రేవణ్ణను విచారించనున్నారు. జూన్ 1న హోలెనర్సాపూర్‌లో ఉన్న ఇంట్లో విచారణకు సిద్ధంగా ఉండాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్