పాలమూరుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని BRS పార్టీ ఆరోపించింది. 'రేవంత్ సర్కార్ అలసత్వం వల్లే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతుల ఇవ్వకుండా డీపీఆర్‌ను CWC వెనక్కి తిప్పి పంపించింది. నాటి నుంచే పాలమూరు ప్రాజెక్టుకు ఏపీ సర్కారు, టీకాంగ్రెస్ మోకాలడ్డి, ఎన్జీటీ, సుప్రీంకోర్టులలో కేసులు వేస్తూ ఆటంకాలు సృష్టించారు. అయినా మొక్కవోని దీక్షతో కేసీఆర్ 90టీఎంసీల నికర జలాలను ప్రాజెక్టుకు కేటాయించేలా చేశారు' అని పేర్కొంది.