కర్ణాటకలోని బెళగావిలో సీడబ్ల్యూసీ (నవ సత్యాగ్రహ్ బైఠక్) సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1924, డిసెంబర్ 26న మహాత్మా గాంధీ నేతృత్వంలో కర్ణాటకలోని బెళగావిలో సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించారని వందేళ్ల అనంతరం అదే స్ఫూర్తితో ఈ సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.