కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి రైతులను దగా చేసింది: హరీష్ రావు

79చూసినవారు
కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి రైతులను దగా చేసింది: హరీష్ రావు
కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి రైతులను దగా చేసిందని BRS ఎమ్మెల్యే హరీష్ రావు శనివారం ఆరోపించారు. రైతు భరోసా కింద ఏడాదికి ఎకరానికి రూ.15వేలు ఇస్తామని చెప్పి రూ.12వేలకు కుదించారని అన్నారు. కాంగ్రెస్‌ మోసపూరిత కుట్రకు ఈ నిర్ణయం పరాకాష్ట అని మండిపడ్డారు. రైతుబంధు స్ఫూర్తికి వ్యతిరేకంగా కేబినెట్‌ నిర్ణయాలు తీసుకుందని ధ్వజమెత్తారు. నమ్మించి గొంతు కోసిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని హరీష్ రావు అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్