కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం: ఎర్రబెల్లి

78చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం: ఎర్రబెల్లి
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బ్రోకర్ మాటలతో అధికారం చేపట్టారన్నారు. గత 15 నెలల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ 100 సీట్లు గెలుచుకుంటుందని, కేసీఆర్ తిరిగి సీఎం అవుతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్