ప్రముఖ ప్రైవేటురంగ బ్యాంకు కోటక్ మహీంద్రాపై విధించిన పర్యవేక్షక ఆంక్షలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఎత్తివేసింది. ఈ మేరకు 2024 ఏప్రిల్ 24న విధించిన ఆంక్షలను తొలగిస్తున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. బ్యాంక్ తన ఆన్‌లైన్ ఛానల్స్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి, తిరిగి కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు అనుమతించింది. గతంలో పలు లోపాలను గమనించిన ఆర్‌బీఐ కోటక్ బ్యాంక్‌పై ఈ ఆంక్షలు విధించింది.