TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎవరి అభిప్రాయం తీసుకోకుండా కేబినెట్ పేరుతో సభను వాయిదా వేయడం ఏంటని ప్రశ్నించారు. సభలో కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందంటూ, ఈ పద్ధతి మార్చుకోవాలని అసహనం వ్యక్తం చేశారు. సభా మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందంటూ, సభ సమయాన్ని వృధా చేయడం సరైన పద్ధతి కాదన్నారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సమగ్రంగా చర్చలు జరపాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.