ఉపాధి కూలీని చెంప మీద కొట్టిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి (వీడియో)

41707చూసినవారు
ఉపాధి కూలీ మహిళను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి చెంప మీద కొట్టడం వివాదంగా మారింది. ఆర్మూర్ మండలం గోవింద్ పేట్, చేపూర్, విప్రి గ్రామాలలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఉపాధి మహిళా కూలీని జీవన్ రెడ్డి చెంపపై కొట్టారు. వృద్ధురాలిని చెంపపై కొట్టడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్