నిరుద్యోగులు, ఉద్యోగులకు చంద్రబాబు శుభవార్త

74చూసినవారు
నిరుద్యోగులు, ఉద్యోగులకు చంద్రబాబు శుభవార్త
నిరుద్యోగులు, ఉద్యోగులకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభవార్త తెలిపారు. ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు, టీచర్లకు ఆయన లేఖ రాశారు. తాము అధికారంలోకి వస్తే డీఎస్సీపైనే తొలి సంతకం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అందిస్తామని చెప్పారు. సకాలంలో జీతాలు, పింఛన్లు అందజేయడంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. ఖాళీ పోస్టులన్నింటిని భర్తీ చేస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్