కేసిఆర్ కట్టించిన మల్లన్న సాగర్ 21 TMCల నీటితో ఒక సముద్రంలాగా కనిపిస్తుందని హరీశ్ రావు అన్నారు. 'ఎల్లంపల్లి నుంచి లక్ష్మీ బ్యారేజ్ నుంచి అన్నపూర్ణ మ్యారేజ్ నుంచి రంగనాయక సాగర్ నుంచి మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండడం వల్లే సాధ్యమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద పండే ప్రతీ పంటలో కేసీఆర్ పేరు ఉంది. కాళేశ్వరం కొట్టుకుపోయిందనే మూర్ఖపు ప్రచారాన్ని కాంగ్రెస్ మానుకోవాలి' అని సూచించారు.