తెలంగాణలో రేపటి నుంచి యువ పోరాట యాత్ర ప్రారంభం అవుతుందని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్ర 33 జిల్లాలో కొనసాగిస్తామని తెలిపారు. గజ్వేల్ నుంచి యువ పోరాట యాత్రను ప్రారంభించినున్నట్లు తెలిపారు.నిరుద్యోగ యువత సమస్యలను తెలియజేసేందుకు ఈ యాత్రను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు.