TG: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కసరత్తు చేస్తోంది. MLC ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్ నుంచి నిర్మాణం ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ పథకాలను షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప్రచారం చేయాలని I&PR, హౌసింగ్ శాఖలపై సమీక్షలో ఆయన వెల్లడించారు. ORR, RRR చుట్టూ శాటిలైట్ టౌన్షిప్ లు నిర్మించాలని భట్టి సూచించారు.