గాజా పునర్నిర్మాణానికి సహకరించాలని పాలస్తీనా భారత్కు విజ్ఞప్తి చేసింది. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. తాజాగా ఇజ్రాయెల్-హమాస్ల మధ్య శాంతి ఒప్పందం జరగడంతో దాడులు ఆగిపోయాయి. ఈ క్రమంలో గాజా పునర్నిర్మాణానికి సహకరించాలని భారత్లోని పాలస్తీనా దౌత్యాధికారి అబెద్ ఎల్రాజెగ్ అబు జాజెర్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు.