కాంగ్రెస్ సర్కార్‌కు కౌంట్ డౌన్ షురూ.. కేటీఆర్‌ ట్వీట్‌

85చూసినవారు
కాంగ్రెస్ సర్కార్‌కు కౌంట్ డౌన్ షురూ.. కేటీఆర్‌ ట్వీట్‌
తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్ మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కిందని కేటీఆర్ ఎక్స్‌ వేదికగా ఆరోపించారు. హస్తం పార్టీ ఆరు గ్యారంటీల్లో భాగంగా వరిపంటకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడేమో సన్న రకం ధాన్యానికి బోనస్ అని, దొడ్డు వడ్లకు ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు. ఇది కపట కాంగ్రెస్ మార్క్ మోసం, దగా, నయవంచన అని కేటీఆర్ ఆక్షేపించారు. రైతన్నల చేతిలో కాంగ్రెస్ సర్కారుకి కౌంట్ డౌన్ మొదలైందన్నారు.

సంబంధిత పోస్ట్