తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రి(M) మామిడిగట్టులో విషాదం నెలకొంది. వేర్వేరు చోట్ల ప్రియురాలు, ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నారు. ముందుగా ఉరి వేసుకుని సంగీత(21) సూసైడ్ చేసుకుంది. ప్రియురాలి మరణవార్త తెలిసి ప్రియుడు భగవాన్(21) నెన్నల మండలం చిత్తాపూర్ లో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.